హైదరాబాద్‌లో మరో ఉద్యోగ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ నిరుద్యోగ మహిళ నుంచి దాదాపు రూ.2.3 లక్షలు వసూలు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా నకిలీ జాయినింగ్ లెటర్లు పంపించి మోసానికి పాల్పడిన ఈ ఘటన యువతలో ఆందోళన కలిగిస్తోంది.
నిరుద్యోగులు బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంతమంది డబ్బు కోసం దొంగ దారులు తొక్కుతున్నారు.
ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ ఓ మహిళలను మోసం చేసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడ్డంగా బుక్ అయ్యాడు.
ఈ ఘటన నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ఉద్యోగ మోసాలపై ఎప్పటికప్పుడు పోలీసులు హై అలెర్ట్ ప్రకటిస్తున్న సరే కొంతమంది ఉద్యోగం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
ఉద్యోగం మోసాలపై యువత మరింత ప్రమిత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తుంది.
పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం..హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన టి.కిశోర్ ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
తక్కువ సమయంలో సులభంగా డబ్బులు సంపాదించాలని దురాశతో అతడు సైబర్ మోసాలకు పాల్పడడం ప్రారంభించినట్లు దర్యాప్తులో బయటపడింది.
ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడు అన్న విషయం బయటపడింది .
అంబర్ పేట్ ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగ మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకున్నారు.
తాను ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించగలనని చెప్పి మెల్లమెల్లగా మాట కలిపి కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ నమ్మబలికాడు.
మొదట మహిళతో స్నేహపూర్వకంగా మాట్లాడిన అతడు ఆ తర్వాత ఆమె నమ్మకాన్ని పూర్తిగా సంపాదించాడు.
ఈ క్రమంలోనే ఆ మహిళ ఉద్యోగం కోసం అతగాడికి డబ్బులు ఇచ్చింది. ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ ఫీజ్ అని.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని.. ట్రైనింగ్ చార్జీలు అని.. ప్రోసెసింగ్ ఫీజుల పేరుతో విడతల వారీగా డబ్బులు చెల్లించేలా ఒత్తిడి చేశాడట.
బాధితురాలు ఉద్యోగం పై ఆశతో అతను చెప్పినట్లు వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం దాదాపుగా రెండు లక్షల 30 వేల జమ చేసినట్లు తెలుస్తుంది.
అంతేకాదు నిందితుడు వాట్సప్ ద్వారా నకిలీ జాయినింగ్ లెటర్లు పంపడంతో అసలు విషయం బయటపడింది.
కంపెనీ లోగోలు.. అధికారిక ముద్రలు ఉన్నట్టుగా రూపొందించడం ఫేక్ డాక్యుమెంట్లను పంపడంతో బాధితురాలు అసలు విషయం తెలుసుకుంది. అతగాడు ఫ్రాడ్ అని అతడు చెప్పిందంతా అబద్ధమని తెలుసుకుంది.
దీంతో అతగాడిని నిలదీసింది. మాయమాటలు చెబుతూ తప్పించుకోవడానికి అతగాడు బాగా ట్రై చేశాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి అతగాడిని గుర్తించారు.
అనంతరం అతన్ని ఆదుపులోకి తీసుకొని విచారించగా ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న విషయాలు బయటపడ్డాయి. సోమవారం నిందితుడిని కోర్టులో హాజరు పరచక న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
ఈ సందర్భంగా అంబర్ పేట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, టెలిగ్రామ్ వంటి వేదికల ద్వారా.. ఉద్యోగాలు ఇస్తాం డబ్బు కట్టండి అంటే నమ్మద్దు అంటూ హెచ్చరించారు. ముఖ్యంగా డబ్బు కడితేనే ఉద్యోగం ఇస్తాం అన్న వ్యక్తులని అస్సలు నమ్మకండి అని.. అలాంటి వాళ్ల గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. యువత అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
FAQ’s
1. ఉద్యోగం పేరుతో జరిగే సైబర్ మోసాలు ఎలా గుర్తించాలి?
ముందుగా డబ్బు అడగడం, WhatsApp ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ చేయడం, ఫేక్ జాయినింగ్ లెటర్లు పంపడం వంటి లక్షణాలు ఉంటాయి.
2. సోషల్ మీడియా జాబ్ ఆఫర్లను నమ్మవచ్చా?
అధికారిక కంపెనీ వెబ్సైట్ లేదా verified HR వివరాలు లేకపోతే నమ్మకూడదు.
3. ఫేక్ జాయినింగ్ లెటర్ ఎలా గుర్తించాలి?
లోగోలు, సిగ్నేచర్లు ఉన్నా కూడా అధికారిక డొమైన్ ఈమెయిల్ లేకపోతే అనుమానం పెట్టుకోవాలి.
4. ఉద్యోగ మోసానికి గురైతే ఏం చేయాలి?
వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.
5. తెలంగాణలో ఉద్యోగ మోసాలు పెరుగుతున్నాయా?
అవును. ముఖ్యంగా సోషల్ మీడియా, Telegram, WhatsApp వేదికల ద్వారా ఉద్యోగ మోసాలు పెరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


