HomeLatest Newsఛీ..ఛీ..అసలు వీడు మనిషేనా..? నడిరోడ్డు పై మహిళతో ఛండాలమైన పని..!

ఛీ..ఛీ..అసలు వీడు మనిషేనా..? నడిరోడ్డు పై మహిళతో ఛండాలమైన పని..!

Published on

spot_img

హైదరాబాద్ మణికొండలో పగటిపూట నడిరోడ్డుపై మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పసిబిడ్డను చేతిలో పట్టుకొని వెళ్తున్న మహిళ వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని యువకుడు ఆమె డ్రస్సును లాగుతూ వికృతంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మొత్తం సమీపంలోని CCTV కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మణికొండలో ఏమి జరిగింది?

హైదరాబాద్ మణికొండలో పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై ఓ యువకుడు నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఘటన CCTVలో రికార్డ్ అయింది.

ఘటన ఎక్కడ జరిగింది?

ఈ ఘటన మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్ రోడ్డుపై జరిగింది.

పోలీసులు ఏమి చేశారు?

పోలీసులు కేసు నమోదు చేసి CCTV ఆధారంగా నిందితుడి కోసం దర్యాప్తు చేస్తున్నారు.

ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే ముందు వరకు ఆడపిల్లలపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది.

దానికి సంబంధించిన వార్తలు కూడా మనం చదువుతూనే ఉంటున్నాం. ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకున్న సరే అడపాదడపా ఆడపిల్లలను ఏడిపిస్తూనే వస్తున్నారు కొంతమంది మగ మృగాలు.

తాజాగా హైదరాబాద్ నగరంలోని మణికొండలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నడి రోడ్డుపై పసిబిడ్డని ఎత్తుకొని వెళ్తున్న ఒక మహిళ పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించాడు ఒక సైకో యువకుడు.

ఆ సైకో యువకుడు ప్రవర్తించిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఐటి కొరడార్ కి సమీపంలో ఉంటూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఈ విధంగా జరగడం ఇంకా షాకింగ్ గా మారింది.

మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ రోడ్డుపై ఒక మహిళ తన పసి బిడ్డను చేతిలో పట్టుకొని రోజూలానే సాధారణంగా నడుచుకుంటూ వెళుతుంది.

తన పని తాను చూసుకుంటూ సైలెంట్ గా వెళుతున్న మహిళ పట్ల ఓ సైకో యువకుడు కిరాతకంగా ప్రవర్తించాడు.

ఆమె రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆమె వెనుక వైపు నుండి నడుచుకుంటూ వచ్చిన ఒక గుర్తు తెలియని యువకుడు..

హఠాత్తుగా ఆమె డ్రస్సును పైకి లాగి అత్యంత అసభ్యకరంగా, నీచంగా, వికృతంగా ప్రవర్తించాడు.

ఆ మహిళ ఒక్కసారిగా భయపడి పోయింది. వెంటనే తనను తాను రక్షించుకోవడానికి అతగాడిని తోసేసింది.

పగటిపూట నడిరోడ్డుపై ఇలా జరగడం అందరికీ షాకింగ్ గా ఉంది. ఈ అనాగరిక చర్యకి సంబంధించిన దృశ్యాలన్ని అక్కడ సమీపంలో ఉన్న సిసిటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

FAQ’s

1. మణికొండ ఘటనలో నిందితుడు పట్టుబడ్డాడా?

పోలీసులు ప్రస్తుతం CCTV ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

2. ఘటన ఏ సమయంలో జరిగింది?

పగటిపూట రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

3. వీడియో ఎలా బయటకు వచ్చింది?

సమీపంలోని CCTV కెమెరాల్లో ఘటన మొత్తం రికార్డ్ కావడంతో వీడియో బయటకు వచ్చింది.

4. మహిళ సురక్షితంగానే ఉన్నారా?

అవును, మహిళ వెంటనే ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకుంది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.