EPFO UPI Withdrawal అంటే ఏమిటి?
EPFO తీసుకురాబోతున్న కొత్త UPI విధానం ద్వారా సభ్యులు తమ PF ఖాతాలను Google Pay, PhonePe తరహాలో ఉపయోగించుకోవచ్చు. యూపీఐ PIN సహాయంతో PF బ్యాలెన్స్ చెక్ చేయడం, డబ్బులు విత్‌డ్రా చేయడం మరియు డిజిటల్ చెల్లింపులు చేయడం సులభం కానుంది.
Employees’ Provident Fund Organisation చందాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది.
ఇకపై పీఎఫ్ ఖాతాలను సాధారణ బ్యాంకు ఖాతాల మాదిరిగానే సులభంగా వినియోగించుకునేలా కొత్త విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది.
అత్యవసర పరిస్థితిలో పీఎఫ్ డబ్బులు పొందడానికి రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే మొత్తం యూపీఐ ఆధారిత వ్యవస్థ ద్వారా నిమిషాలలోనే నిధులను విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించబోతుంది.
ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి Mansukh Mandaviya మంగళవారం వెల్లడించారు. కొత్త విధానానికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయి అని ఆయన తెలిపారు.
అంతేకాదు ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే సభ్యులు Google pay, phone pe వంటి Apps తరహాలో తమ పిఎఫ్ ఖాతాను ఉపయోగించుకోగలరు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ విధానంలో భాగంగా సభ్యులు తమ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ ని సులభంగా చెక్ చేసుకోవచ్చు.
అదే విధంగా యూపీఐ పిన్ సహాయంతో సురక్షితంగా నిధులను విత్ డ్రా చేసుకునే వీలు కూడా ఉంటుంది.
విత్ డ్రా చేసిన మొత్తాన్ని నేరుగా డిజిటల్ చెల్లింపులకు వినియోగించుకోవడంతో పాటు అవసరమైతే ఏటీఎంల ద్వారా నగదు కూడా మార్చుకున్న అవకాశం కల్పించబోతున్నారు.
అదేవిధంగా పిఎఫ్ ఖాతాలో కొంత మొత్తాన్ని నిల్వ ఉంచుతూ అవసరమైన మేరకు మాత్రమే డబ్బు డ్రా చేసుకునేలా కార్మిక శాఖ కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇక సభ్యులకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈపీఎఫ్ఓ త్వరలో వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించనుంది.
వచ్చే నెలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని కేంద్రం వెల్లడించింది.
దీంతో ఇక పిఎఫ్ సంబంధిత సమాచారం, క్లెయిమ్ స్టేటస్, బ్యాలెన్స్ వంటి వివరాలను వాట్సాప్ ద్వారానే తెలుసుకునే అవకాశం సభ్యులకు లభించబోతుంది.
FAQ’s
1. PF డబ్బులు UPI ద్వారా ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చు?
కొత్త EPFO వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత UPI PIN ద్వారా PF డబ్బులు నిమిషాల్లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
2. Google Pay, PhonePe ద్వారా PF ఉపయోగించగలమా?
అవును. కొత్త విధానం ప్రకారం PF ఖాతాలు ప్రముఖ UPI Appsతో అనుసంధానం అయ్యే అవకాశం ఉంది.
3. PF బ్యాలెన్స్ WhatsAppలో చూడగలమా?
త్వరలో ప్రారంభం కానున్న WhatsApp సేవల ద్వారా PF బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
4. PF డబ్బులు ATMలో తీసుకోవచ్చా?
కేంద్రం పరిశీలిస్తున్న కొత్త విధానం ప్రకారం ATM ద్వారా కూడా నగదు పొందే అవకాశం కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
5. ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయని కేంద్రం తెలిపింది. త్వరలోనే ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


