HomeWarangal Newsహీట్‌వేవ్‌కు హైటెక్ సొల్యూషన్.. వరంగల్‌లో మిస్టింగ్ బస్ స్టాప్‌లు ప్రారంభం..!

హీట్‌వేవ్‌కు హైటెక్ సొల్యూషన్.. వరంగల్‌లో మిస్టింగ్ బస్ స్టాప్‌లు ప్రారంభం..!

Published on

spot_img

వేసవి ఎండలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మిస్టింగ్ వాటర్ బస్ స్టాప్‌లను ప్రారంభించారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణతో పాటు పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సదుపాయాలను ప్రారంభించి పరిశీలించారు.

ప్రజా రవాణా వినియోగదారులు తీవ్ర ఎండలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ మిస్టింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

అధిక పీడన నాజిల్స్ ద్వారా విడుదలయ్యే సూక్ష్మ నీటి బిందువులు గాలిలో ఆవిరైపోతూ.. పరిసర ఉష్ణోగ్రతను 5 నుంచి 10 డిగ్రీల వరకు తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటాయి అని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..”వరంగల్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలకు ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఉద్యోగాలు, విద్య, వైద్య అవసరాల కోసం వస్తూ ఉంటారని..

అలాంటి వాళ్లకి ముఖ్యంగా బస్ స్టాప్ ల వద్ద ప్రయాణికులు ఎక్కువగా వేచి ఉండాల్సి వస్తుందని.. అలాంటి వారికి తాత్కాలిక చల్లని వాతావరణాన్ని కల్పించేందుకు మిస్టింగ్ బస్ స్టాప్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles