HomeLatest Newsతెలంగాణ PECET హాల్‌టికెట్లు రిలీజ్.. పరీక్షార్థులకు కీలక అప్డేట్..!

తెలంగాణ PECET హాల్‌టికెట్లు రిలీజ్.. పరీక్షార్థులకు కీలక అప్డేట్..!

Published on

spot_img

తెలంగాణ రాష్ట్రంలోని బీపీఈడీ (Bachelor of Physical Education), యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PECET) హాల్‌టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ విషయాన్ని పరీక్ష కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ వెల్లడించారు.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, జన్మ తేదీ వంటి వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ ను సులభంగా పొందవచ్చు . హాల్ టికెట్ లో అభ్యర్థి పేరు, పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి అని అధికారులు తెలిపారు.

పరీక్షకు హాజరయ్యే ముందు హాల్ టికెట్ లోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ తో పాటు సరైన గుర్తింపు కార్డు కూడా తీసుకురావడం తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు. హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అలాగే పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని పరీక్షా నియమాలను కచ్చితంగా పాటించాలని అభ్యర్థులకు సూచించారు. తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషనల్ సెట్ కు సంబంధించిన పూర్తి సమాచారం పరీక్ష షెడ్యూల్ మరియు ఇతర మార్గదర్శకాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చని కన్వీనర్ తెలిపారు. ఈ హాల్‌టికెట్లను https://pecet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌కుమార్‌ తెలిపారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.