HomeLatest Newsఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయాలు..!

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయాలు..!

Published on

spot_img

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యా, మౌలిక వసతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజాసేవలకు సంబంధించి అంశాలపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీల్లో కూడా మధ్యాహ్నం పథకాన్ని అమలు చేయడానికి క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన ఈ పథకాన్ని ఇకపై ఇంటర్ విద్యార్థులకు కూడా విస్తరించనున్నారు.

దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాదిమంది విద్యార్థులకు ఉపశమనం కలగనుంది. అంతేకాకుండా విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపరిచేందుకు ఉదయం సమయంలో పాలు మరియు అల్పాహారం అందించే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులు ఖాళీ కడుపుతో తరగతులకు హాజరుకాకుండా ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అదేవిధంగా 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. మొత్తం 1000 కోట్లతో పుష్కర ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించగా.. తొలి విడతగా 300 కోట్ల విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా కరీంనగర్ జిల్లా గంగాధర లో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ కళాశాల కోసం 20 రెగ్యులర్‌ పోస్టులు, 6 నాన్‌ టీచింగ్‌ పోస్టులు, 3 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులను మంజూరు చేసింది.

ఇక ప్రజల భద్రత అత్యవసర సేవలకు మరింత బలోపేతం చేయడానికి మెహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 కొత్త పోస్టులను మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. మొత్తంగా చూస్తే విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, అత్యవసర సేవలు బలోపేతం వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టికి పెట్టినట్లు తాజా క్యాబినెట్ నిర్ణయాల ద్వారా స్పష్టమవుతుంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.