HomeWarangal Newsమహిళా శక్తి వారోత్సవాల్లో అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

మహిళా శక్తి వారోత్సవాల్లో అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Published on

spot_img

మహిళా శక్తి వారోత్సవాల్లో అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి :

హనుమకొండ జిల్లా సంగెం మండలం గుంటూరు పల్లి గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా నూతన అంగన్వాడి భవనాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధ్యాణ్యత ఇస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వంటివని గర్భిణీలు మరియు బాలింతల ఆరోగ్య సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు”.

పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు ప్రీ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేపడుతున్నామని వెల్లడించారు. అదేవిధంగా విద్యారంగంలో ఆధునిక ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను ఏర్పాటు చేస్తున్నామని.. పిల్లలకు మెరుగైన పోషక ఆహారం అందించేందుకు డైట్ చార్జీలను పెంచినట్లు చెప్పారు.

మహిళల సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని.. మహిళలు ఆర్థికంగా మరియు సామాజికంగా మరింత బలోపడేలా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్య వైద్యం పోషకాహారం వంటి అంశాలలో సమన్వయంతో పనిచేస్తూ గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles