HomeWarangal Newsఉమ్మడి వరంగల్ రైతులకు ఊరట.. ధాన్యం కొనుగోళ్లపై కడియం శ్రీహరి కీలక సూచనలు

ఉమ్మడి వరంగల్ రైతులకు ఊరట.. ధాన్యం కొనుగోళ్లపై కడియం శ్రీహరి కీలక సూచనలు

Published on

spot_img

ఉమ్మడి వరంగల్ రైతులకు ఊరట.. ధాన్యం కొనుగోళ్లపై కడియం శ్రీహరి కీలక సూచనలు:

హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొలుగోళ్లు, రవాణా ప్రక్రియపై జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు.

ఈ సమావేశంలో మాట్లాడిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని జనగామ జిల్లా ఐదు మండలాలలో ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి మండలంలో సుమారు ఐదు నుంచి 6000 క్వింటాల ధాన్యం మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రవాణా ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందన్నారు. ఇప్పటివరకు సుమారు 80 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మాత్రమే తరలించగలిగామని.. ఇంకా 30 వేల క్వింటాళ్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.

అకాల వర్షాలు, అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితిలో కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంటూ ధాన్యం కొనుగోలు మరియు రవాణా పనులను వేగవంతం చేయాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 4వ తేదీ లోపు అన్ని ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా ఇసుక లారీలు, డీసీఎంలు సహా అందుబాటులో ఉన్న అన్ని రవాణా వాహనాలను వచ్చే వారం రోజులపాటు ధాన్యం తరలింపుకే వినియోగించాలని అధికారులు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు రవాణా ప్రక్రియను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles