HomeLatest Newsయువతకు ఉపాధి అవకాశం – టూరిజం గైడ్‌గా మారేందుకు సువర్ణావకాశం

యువతకు ఉపాధి అవకాశం – టూరిజం గైడ్‌గా మారేందుకు సువర్ణావకాశం

Published on

spot_img

యువతకు ఉపాధి అవకాశం – టూరిజం గైడ్‌గా మారేందుకు సువర్ణావకాశం:

తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పించే దిశగా మరో కీలక కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, దేవాలయ ప్రాంతాలపై అవగాహన కలిగిన యువతను ప్రోత్సహిస్తూ “టూరిస్ట్ గైడ్” అవకాశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాధాన్యత గల ప్రాంతాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. అనంతరం వారికి “టూరిస్ట్ గైడ్” గా గుర్తింపు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం గుర్తింపు పొందిన “టూరిస్ట్ గైడ్” సర్టిఫికేట్ అందజేయనున్నారు. తద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులకు మార్గదర్శకులుగా పనిచేసే అవకాశం లభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, భద్రాచలం, రామప్ప దేవాలయం, యాదాద్రి, బొగ్గుగుట్టలు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వీరికి మంచి అవకాశాలు ఉంటాయని అధికారులు తెలిపారు. స్థానిక చరిత్రపై అవగాహనతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలిగిన వారికి ప్రాధాన్యత ఉండనుందని వెల్లడించారు.

అర్హతలు:

  • తెలంగాణ చరిత్ర సంస్కృతి దేవాలయాలు మరియు పర్యాటక ప్రదేశాలపై అవగాహన ఉండాలి.
  • చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
  • పర్యాటక రంగంపై ఆసక్తి ఉండాలి.
  • అభ్యర్థులు గూగుల్ ఫామ్ https://docs.google.com/forms/d/e/1FAIpQLSdfLenWj-5csepK7CfawDDJEWC21PJaGbDjT8M0wsYS8k_9ww/viewform ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ అవకాశం ద్వారా పర్యాటక రంగంలో కెరియర్ను నిర్మించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.