HomeLatest Newsపవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్

పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్

Published on

spot_img

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ‘నవనిర్మాణ సభ’ నిర్వహించ తలపెట్టడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

​తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ ముందుగా క్షమాపణలు చెప్పిన తర్వాతే ఇక్కడ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల వివరాలు:

​”తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజుల పాటు అన్నం తినకుండా మానేశానని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాంటి భావజాలం ఉన్న వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ గడ్డపైకి వచ్చి ఇక్కడ సభలు పెట్టడం ఎంతవరకు సమంజసం?” అని ఆయన ఆక్షేపించారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలపై మండిపడుతూ.. “డబ్బులు ఇస్తే ఏ రకమైన నటన చేయమన్నా చేస్తారు. తెలంగాణను తీసుకువెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టడమే పవన్ కళ్యాణ్ చెప్పే నవ నిర్మాణమా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

​హైదరాబాద్‌లో జనసేన సభ నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.