ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ వాచ్ హాట్ టాపిక్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే:
2026 ఐపిఎల్ సీజన్ కు మే 31న తెరపడగా ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) మరోసారి విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. గత సీజన్ లో తొలి టైటిల్ ని.. గెలుచుకున్న ఆర్సిబి ఈసారి కూడా అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి ఛాంపియన్ గా అవతరించింది. ఈ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మద్దతుగా అతని భార్య ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్టేడియానికి హాజరయ్యింది. సాధారణమైన వైట్ టీషర్ట్.. బ్లూ జీన్స్ లో ఎంతో స్టైలిష్ గా కనిపించిన ఆమె పిక్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

అయితే ఆమె దుస్తులు కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె చేతికి ధరించిన లగ్జరీయస్ వాచ్. ఫ్యాషన్ వర్గాల సమాచారం ప్రకారం.. అనుష్కశర్మ ధరించిన ఈ వాచ్ ప్రముఖ లగ్జరీయస్ బ్రాండ్ కార్డియార్ కు చెందిన ‘పాంథెర్’ సిరీస్ మోడల్‌గా గుర్తించారు. ఈ వాచ్ విలువ సుమారు 28 లక్షలకు పైగానే ఉండొచ్చు అంటున్నారు. దీంతో ఈ వాచ్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కొంతమంది నెటిజన్లు ఒక చేతి గడియారం కోసం ఇంత భారీ మొత్తంగా ఖర్చు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం అనుష్క శర్మ స్థాయికి తగిన లగ్జరీ యాక్సెసరీ ఇదేనని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆర్సిబి విజయం అనంతరం మైదానంలో అనుష్క ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


