HomeWarangal Newsకేసీఆర్‌కు అండగా నిలిచిన నిబద్ధత కలిగిన నాయకుడు హరీష్ రావు: దాస్యం వినయ్ భాస్కర్

కేసీఆర్‌కు అండగా నిలిచిన నిబద్ధత కలిగిన నాయకుడు హరీష్ రావు: దాస్యం వినయ్ భాస్కర్

Published on

spot_img

కేసీఆర్‌కు అండగా నిలిచిన నిబద్ధత కలిగిన నాయకుడు హరీష్ రావు: దాస్యం వినయ్ భాస్కర్

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నేత మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు బుధవారం హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ..”బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు కేసీఆర్ కి అండగా నిలుస్తూ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లిన నిబద్ధత కలిగిన నాయకుడు హరీష్ రావు అని కొనియాడారు”.

పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి మార్గనిర్దేశం చేస్తూ కార్యకర్తలకు అండగా నిలిచే నాయకత్వ లక్షణాలు హరీష్ రావు ప్రత్యేకత అని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న హరీష్ రావు సేవలు పార్టీకి ఎంతో విలువైనవని దాస్యం వినయ భాస్కర్ తెలిపారు.

ఆయన మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేసేలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. హరీష్ రావు జన్మదినాన్ని పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles