HomeWarangal Newsతెలంగాణ లాసెట్‌లో సత్తా చాటిన మావోయిస్ట్ మాజీ అగ్రనేత దేవ్‌జీ..!

తెలంగాణ లాసెట్‌లో సత్తా చాటిన మావోయిస్ట్ మాజీ అగ్రనేత దేవ్‌జీ..!

Published on

spot_img

తెలంగాణ లాసెట్‌లో సత్తా చాటిన మావోయిస్ట్ మాజీ అగ్రనేత దేవ్‌జీ..!

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తెలంగాణ లా సెట్-2026 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. గురువారం విడుదలైన ఫలితాల్లో ఆయన 349వ ర్యాంకు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. సుదీర్ఘకాలం విప్లవ ఉద్యమంలో పనిచేసిన దేవ్‌జీ ఇటీవల సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చి తన విద్యను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

ఆరు పదుల వయసులోనూ చదువుపై ఆసక్తి కోల్పోకుండా గత నెల నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. న్యాయవిద్యను అభ్యసించి సమాజంలోని పేద, బలహీన వర్గాలకు న్యాయసహాయం అందించాలని లక్ష్యంతో ఆయన ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. విద్యకు వయసు అడ్డంకి కాదు అని తన కృషితో నిరూపించారు.

ఇటీవల 43 సంవత్సరాల క్రితం అసంపూర్తిగా మిగిలిపోయిన ఇంటర్మీడియట్ తెలుగు పేపర్ ని ఇంటర్ బోర్డ్ అనుమతితో తిరిగి రాసి వార్తల్లో నిలిచిన దేవ్‌జీ.. ఇప్పుడు లా సెట్ లో మంచి ర్యాంకు సాధించడం ద్వారా మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పట్టుదల సంకల్పం ఉంటే జీవితంలో ఏ దశలోనైనా లక్ష్యాలను సాధించవచ్చు అని ఆయన విజయం స్పష్టంగా చాటిచెబుతుంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles