HomeLatest Newsశ్రీ చైతన్య కాలేజీలో కలకలం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!

శ్రీ చైతన్య కాలేజీలో కలకలం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!

Published on

spot_img

హైదరాబాద్: నగర శివారులోని కోహెడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఒక విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

తల్లిదండ్రుల అనుమానాలు – యాజమాన్యం నిర్లక్ష్యం?

మృతుడైన తమ కుమారుడు కేవలం 4 రోజుల క్రితమే హాస్టల్‌కు వచ్చాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు 3 గంటల వరకు తమకు ఎలాంటి సమాచారం అందించకపోవడంపై వారు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాలేజీ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన:

విషయం తెలియగానే విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు చేరుకుని గేటు ముందు ధర్నాకు దిగాయి. విద్యార్థి మృతికి కారణాలపై స్పష్టత ఇవ్వాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కాగా, ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో యాజమాన్యం కాలేజీలోని ఇతర విద్యార్థులను అత్యవసరంగా ఇళ్లకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.