నిమ్స్‌కు కొత్త సారథి.. డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ :
హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ నిమ్స్ ఆసుపత్రిలోనే యూరాలజీ విభాగానికి ప్రొఫెసర్‌గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా సేవలు అందిస్తున్నారు.

ఆయన అర్హతలను, అనుభవాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. నిబంధనల ప్రకారం ఆయనను మూడేళ్ల పాటు ఆయ నిమ్స్ డైరెక్టర్‌గా కొనసాగుతారని తెలంగాణ గవర్నర్ పేరిట ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్.చోంగ్తు అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


