హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు నూతన సీఐగా ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ..:
హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నూతన ఇన్స్పెక్టర్గా ప్రవీణ్ కుమార్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన ఈ పదవిలో నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టేషన్ సిబ్బంది, ట్రాఫిక్ విభాగం అధికారులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..”హనుమకొండ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రద్దీ కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార కేంద్రాల పరిసరాల్లో వాహనాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు”.
ప్రజల సహకారం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ పూర్తిస్థాయిలో సాధ్యం కాదని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో ప్రజల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.


