HomeWarangal Newsవరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. అక్రమ మొరం తవ్వకాలపై వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి

వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. అక్రమ మొరం తవ్వకాలపై వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి

Published on

spot_img

వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత.. అక్రమ మొరం తవ్వకాలపై వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి:

వరంగల్ జిల్లాలో అక్రమ మొరం తవ్వకాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. నర్సంపేట పట్టణ పరిధిలోని మాధన్నపేట చెరువు వద్ద అక్రమంగా మొరం తవ్వుతున్నారనే సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని సూచించిన అధికారులపై మొరం దందాకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు దాడికి దిగినట్లు సమాచారం.

దాడిలో రెవెన్యూ శాఖకు చెందిన నరసింహస్వామి (జీపీఓ)తో పాటు మరో ఉద్యోగి గాయపడినట్లు తెలిసింది. అంతేకాకుండా వారిని కొంతసేపు బంధించి, వారి సెల్‌ఫోన్లను లాక్కున్నట్లు బాధితులు ఆరోపించారు. అధికారులపై జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది.

గాయపడిన అధికారులు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles