HomeWarangal Newsపెళ్లి చేసుకుంటానని మోసం.. వరంగల్ సీసీఎస్ ఎస్ఐపై కేసు నమోదు

పెళ్లి చేసుకుంటానని మోసం.. వరంగల్ సీసీఎస్ ఎస్ఐపై కేసు నమోదు

Published on

spot_img

వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోదారి రాజ్ కుమార్‌పై హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు లైంగిక దాడులు, బెదిరింపులకు పాల్పడ్డాడంటూ బాధిత మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హనుమకొండకు చెందిన యువతి 2018లో బీ.ఫార్మసీ చదువుతున్న సమయంలో ఓ యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అనంతరం దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో 2022లో ఆమె తన భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజ్ కుమార్ తనకు న్యాయం చేస్తానని నమ్మించి, తనకు పరిచయమైన న్యాయవాది ద్వారా భర్తకు విడాకులు ఇప్పించాడని బాధితురాలు ఆరోపించింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను శారీరకంగా లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ క్రమంలో తాను రెండు సార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడని, పెళ్లి విషయమై ప్రశ్నించగా తన న్యూడ్ ఫోటోలు బయటపెడతానని బెదిరించాడని ఆరోపించింది. అలాగే తన ఫోన్ నంబర్, లొకేషన్ వివరాలు సేకరించి వేధింపులకు గురిచేసి, పలుమార్లు బలవంతంగా హోటళ్లకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఇటీవల కూడా హనుమకొండలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, జీవితాంతం తనతో సంబంధం కొనసాగించాలని, లేదంటే న్యూడ్ ఫోటోలు బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించింది.

ఎస్ఐ వేధింపులను భరించలేక బాధిత మహిళ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఐజీకి ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భరోసా సెంటర్‌లో మహిళా పోలీసు అధికారి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజ్ కుమార్‌పై లైంగిక దాడి, బెదిరింపులు, మోసం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles