HomeWarangal Newsనమ్మించి ముంచాడు: హనుమకొండలో వింత మోసం.. స్కూటీతో కేటుగాడు పరార్

నమ్మించి ముంచాడు: హనుమకొండలో వింత మోసం.. స్కూటీతో కేటుగాడు పరార్

Published on

spot_img

​హనుమకొండ:

వ్యాపారం పెరుగుతుందనే ఆశను ఆసరాగా చేసుకుని, ఒక అపరిచిత వ్యక్తి నమ్మించి నట్టేట ముంచిన ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. నకిలీ ఆర్డర్‌తో బురిడీ కొట్టించి, యజమాని బైక్‌తోనే పరారైన ఒక కేటుగాడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

​అసలేం జరిగిందంటే..?

​హనుమకొండ జిల్లా కేంద్రం నక్కలగుట్టలోని ఒక స్వీట్ షాప్ యజమానిని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆశ్రయించాడు. తమ కార్యాలయానికి ప్రతిరోజూ 250 కప్పుల టీ సరఫరా చేయాలంటూ ఒక పెద్ద ఆర్డర్ ఆశ చూపించాడు. ఆ మాటలను నిజమేనని నమ్మిన స్వీట్ షాప్ యజమాని, డీల్ ఓకే చేసుకున్నాడు.

​తీరా ఆర్డర్ ఖరారయ్యాక, “మా ఆఫీస్ ఎక్కడుందో చూపిస్తాను రండి” అంటూ సదరు వ్యక్తి నమ్మబలికాడు. దీంతో ఆ యజమాని తన భార్య, కుమారుడిని అతనితో పాటు పంపించాడు. ఇందుకోసం యజమాని తన స్కూటీని కూడా అతనికి ఇచ్చాడు.

కథ అడ్డం తిరిగిందిలా..

భార్యాపిల్లలను స్కూటీపై ఎక్కించుకెళ్లిన ఆ మాయగాడు, తన ప్లాన్ ప్రకారం వారిద్దరినీ వేర్వేరు ప్రాంతాల్లో దించేశాడు. ఆ తర్వాత ఆఫీస్ చూపించకుండా, యజమానికి సంబంధించిన TG-24-B-3155 నంబర్ గల స్కూటీతో అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. ఎంతసేపటికీ అతను రాకపోవడం, అటు భార్యాపిల్లలు వేర్వేరు చోట్ల ఉండిపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

​ఈ వింత మోసంపై బాధితుడి ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సిసిటివి ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles