HomeLatest Newsగిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు: హనుమకొండలో హాస్టల్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతులు: హనుమకొండలో హాస్టల్ ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

Published on

spot_img

గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా హనుమకొండ అశోక్ కాలనీలో ఏర్పాటు చేసిన నూతన గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు నేడు లాంఛనంగా ప్రారంభించారు.

​ఐటీడీఏ గిరిజన కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన ఈ హాస్టల్‌ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గిరిజన విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేలా, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కేవలం వసతి కల్పించడమే కాకుండా, పౌష్టికాహారంతో కూడిన భోజనం మరియు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించాలని ఆయన సూచించారు.

​ముఖ్యంగా వసతి గృహ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది అంకితభావంతో, సేవా దృక్పథంతో పని చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.

​ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గొట్టిముక్కుల నాగసాగర్, సహాయ గిరిజన అభివృద్ధి అధికారి హసీనా బేగం, ఏసీఎంఓ శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.