HomeWarangal Newsవరంగల్‌లో వీధి కుక్కల బెడద..బయటకు రావాలంటే భయం భయం..!

వరంగల్‌లో వీధి కుక్కల బెడద..బయటకు రావాలంటే భయం భయం..!

Published on

spot_img

వరంగల్‌లో వీధి కుక్కల బెడద..బయటకు రావాలంటే భయం భయం..!:

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో శునకాలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపై నడిచే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా లేబర్ కాలనీలోని ఆయుర్వేదిక్ కళాశాల సమీపంలో..ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన కూలీల పిల్లలపై వీధి కుక్కల గుంపు అకస్మాత్తుగా దాడి చేసింది. ఆడుకుంటున్న చిన్నారులపై దూసుకెళ్లిన కుక్కలు ఒక బాలుడిని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అజయ్ కుమార్, పార్థవి సహా మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి, గాయపడిన ముగ్గురు చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు బయట ఆడుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు కూడా శునకాల సంచారంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ వాహనాలను వెంబడించడం, పాదచారులపై మొరగడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇదే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కనిపిస్తోందని జిల్లా వాసులు అంటున్నారు.

వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. శునకాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వాటికి జనన నియంత్రణ కార్యక్రమాలు అమలు చేయడం, ప్రజలకు భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్య మరింత తీవ్రరూపం దాల్చకముందే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వరంగల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles