HomeWarangal Newsహన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత: ప్రభుత్వ భూముల వేలానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన.. రావు పద్మ అరెస్ట్

హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత: ప్రభుత్వ భూముల వేలానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసన.. రావు పద్మ అరెస్ట్

Published on

spot_img

 హన్మకొండ: బాలసముద్రం పరిధిలో ప్రభుత్వ భూముల వేలం పాట వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

 ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారా?: రావు పద్మ

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనం ఎక్కుతున్న సమయంలో ఆమె ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

“ప్రజా సమస్యలపై, ప్రభుత్వ భూముల అమ్మకాలపై నిలదీస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా? ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూడటం దుర్మార్గం” అంటూ రావు పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 పోలీస్ స్టేషన్‌కు తరలింపు

ఆందోళనకారుల నిరసనలతో బాలసముద్రం ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. రావు పద్మతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles