వరంగల్: ఆహార పదార్థాల నాణ్యతలో నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి వరంగల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం.
నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట (SRR Thota) సమీపంలో గల ఒక కిరాణా దుకాణంలో ఓ వినియోగదారుడు ‘సంగం’ బ్రాండ్‌కు చెందిన పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేశాక ఇంటికి వెళ్లి ఆ పెరుగు ప్యాకెట్‌ను కట్ చేయగా.. అందులో నుంచి ఒక చనిపోయిన ఎలుక పిల్ల బయటపడటంతో సదరు వినియోగదారుడు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురయ్యారు.
వెంటనే ఆయన సదరు కిరాణా దుకాణానికి వెళ్లి యజమానిని నిలదీయడంతో అక్కడ కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్యాకింగ్ కంపెనీల తీవ్ర నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు వినియోగదారుడు అధికారులను డిమాండ్ చేశారు.


