HomeEntertainmentనాంపల్లి కోర్టుకు బన్నీ డుమ్మా.. తొక్కిసలాట కేసులో కొత్త ట్విస్ట్..?

నాంపల్లి కోర్టుకు బన్నీ డుమ్మా.. తొక్కిసలాట కేసులో కొత్త ట్విస్ట్..?

Published on

spot_img

నాంపల్లి కోర్టుకు బన్నీ డుమ్మా.. తొక్కిసలాట కేసులో కొత్త ట్విస్ట్..?:

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో విచారణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో కేసు తదుపరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ సినీ నటుడు ఆల్లు ఆర్జున్ కూడా నేడు కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే, ముందస్తుగా ఖరారైన సినిమా షూటింగ్ కార్యక్రమం కారణంగా ఆయన ప్రస్తుతం ముంబైలో ఉండటంతో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన గైర్హాజరుపై న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.

అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసి, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే, వీలైతే ఆన్‌లైన్ లేదా వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో కొనసాగుతున్న సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన హైదరాబాద్‌కు రావడం సాధ్యం కాలేదని పిటిషన్‌లో వివరించినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా, తదుపరి విచారణ తేదీగా నిర్ణయించిన జూలై 6న కూడా వర్చువల్ విధానంలోనే హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ అంశాలపై వాదనలు విన్న నాంపల్లి కోర్టు, అల్లు అర్జున్ తరఫున సంబంధిత వివరాలతో కూడిన మెమోను దాఖలు చేయాలని ఆదేశించింది.

సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నమోదైన కేసుపై పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు నిర్వహించి, సేకరించిన ఆధారాలతో చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం కేసు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో తదుపరి కోర్టు విచారణలపై ఆసక్తి నెలకొంది.
https://www.instagram.com/alluarjunonline/p/DVlmampkv2S/?hl=en

కోర్టు అల్లు అర్జున్ అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఇప్పుడు సినీ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జూలై 6న జరగనున్న తదుపరి విచారణలో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.