HomeWarangal Newsగోపాల్‌పూర్ చెరువు అభివృద్ధి పనులపై అధికారులకు కలెక్టర్ కీలక సూచనలు

గోపాల్‌పూర్ చెరువు అభివృద్ధి పనులపై అధికారులకు కలెక్టర్ కీలక సూచనలు

Published on

spot_img

గోపాల్‌పూర్ చెరువు అభివృద్ధి పనులపై అధికారులకు కలెక్టర్ కీలక సూచనలు:

హనుమకొండ: గోపాల్‌పూర్ ఊరచెరువులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం గోపాల్‌పూర్ ఊరచెరువును సందర్శించిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న పూడిక తొలగింపు (డీసిల్టేషన్) పనులు, రీటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ, జీడబ్ల్యూఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల వేగం మరియు నాణ్యతపై పలు సూచనలు చేశారు.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చెరువు అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా అదనపు యంత్రాలు, సిబ్బందిని వినియోగించి డీసిల్టేషన్, రీటైనింగ్ వాల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల అమలులో సమన్వయం పెంచి, ప్రతిరోజూ పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

చెరువుల పునరుద్ధరణ వల్ల వర్షపు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం మెరుగుపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ చర్యలు భవిష్యత్తులో నీటి సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles