HomeWarangal Newsవరంగల్: ఓ-సిటీలో ‘కుడా’ ప్లాట్లకు యమ డిమాండ్: గజం ధర రూ. 75 వేలు!

వరంగల్: ఓ-సిటీలో ‘కుడా’ ప్లాట్లకు యమ డిమాండ్: గజం ధర రూ. 75 వేలు!

Published on

spot_img

బహిరంగ వేలంలో 39 రెసిడెన్షియల్ ప్లాట్ల విక్రయం

వరంగల్: నగరంలోని ఓ-సిటీ టౌన్‌షిప్‌లో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో శుక్రవారం రెసిడెన్షియల్ ప్లాట్లకు బహిరంగ వేలం పాట నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్, కుడా వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్ ఈ వేలం పాటల ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తం 45 ప్లాట్లను వేలానికి పెట్టగా, అందులో 39 ప్లాట్లు విక్రయమయ్యాయి.

​ఈ వేలంలో చదరపు గజానికి గరిష్ఠంగా రూ. 75 వేల ధర పలికింది. ఈ ప్లాట్లకు ప్రభుత్వం ప్రకటించిన అప్‌సెట్ ధర గజానికి రూ. 48 వేలు ఉండగా.. అన్ని ప్లాట్లు అంతకంటే ఎక్కువ ధరకే అమ్ముడయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లకు మంచి డిమాండ్ ఉండడం నగర అభివృద్ధికి సానుకూల సంకేతమన్నారు. ఈ వేలంలో కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, ఏఈఓ శంకర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

​రెండు ప్లాట్లకు రహస్య వేలం?

​ప్లాట్ల విక్రయంలో రెండు ప్లాట్లకు రహస్యంగా వేలం నిర్వహించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 39 ప్లాట్లలో 710, 711 నంబర్ గల రెండు ప్లాట్లు ఈస్ట్ ఫేసింగ్‌తో పాటు కొలతలు అనుకూలంగా ఉండడంతో.. వేలం పాటలో ఒక ప్రజాప్రతినిధి అనుచరుడు కలుగజేసుకుని ముందే అధికారులను కలిసి వాటికి రహస్యంగా వేలం జరపాలని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

​500 చదరపు గజాల ఈ రెండు ప్లాట్లు రూ. 80 వేల నుండి రూ. లక్ష వరకు పలికే అవకాశం ఉండగా, కేవలం రూ. 56 వేలు, రూ. 69 వేలకే పడిపోయే విధంగా రింగ్ చేసి తనకు అనుకూలమైన వ్యక్తులకు వచ్చేలా చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిడ్డర్లు సిండికేట్‌గా మారి కొన్ని ప్లాట్లను తక్కువ ధరకే దక్కించుకున్నట్లు తెలిసింది.

​యూనిసిటీ ప్లాట్ల వేలం జూలై 5కు వాయిదా

​ఉనికిచర్ల గ్రామంలో ఈ నెల 28న (ఆదివారం) వేలం పాట నిర్వహించాల్సిన యూనిసిటీ రెసిడెన్షియల్ ప్లాట్ల వేలం పాటను జూలై 5కు వాయిదా వేస్తున్నట్లు కుడా వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రశ్న: వరంగల్‌లో కుడా ప్లాట్ల ధర ఎంత?
జవాబు: వరంగల్ ఓ-సిటీ ప్లాట్ల వేలంలో గరిష్టంగా చదరపు గజానికి రూ.75,000 వరకు ధర నమోదైంది.

ప్రశ్న: కుడా ప్లాట్లకు డిమాండ్ ఎందుకు ఎక్కువ?
జవాబు: మౌలిక సదుపాయాలు, నగర అభివృద్ధి, మంచి లొకేషన్ కారణంగా కుడా ప్లాట్లకు భారీ డిమాండ్ ఉంది.

FAQ’s

1. వరంగల్‌లో కుడా ప్లాట్లు ఎంత ధరకు అమ్ముడయ్యాయి?

గరిష్టంగా గజానికి రూ.75,000 వరకు ధర పలికింది.

2. మొత్తం ఎన్ని ప్లాట్లు అమ్ముడయ్యాయి?

45లో 39 ప్లాట్లు అమ్ముడయ్యాయి.

3. రహస్య వేలం ఆరోపణలు ఏమిటి?

కొన్ని ప్లాట్లు మార్కెట్ ధర కంటే తక్కువకు ముందుగా ఫిక్స్ చేసి అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి.

4. యూనిసిటీ ప్లాట్ల వేలం ఎప్పుడు?

జూలై 5కు వాయిదా పడింది.

5. ఇది పెట్టుబడికి సరైన సమయమా?

డిమాండ్ పెరుగుతున్నందున పెట్టుబడికి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles