గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ GWMC elections waranagal 2026 ఎన్నికలు 2026కి ముందుగా BRS పార్టీ వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్య నేతలు కేటీఆర్ మరియు హరీష్ రావు పర్యటనల ద్వారా పార్టీ శ్రేణులను బలోపేతం చేస్తూ, గెలుపు లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు పలుమార్లు ఓరుగల్లులో పర్యటించారు. ఈ నెల 22న కేటీఆర్ దామెర, మడికొండ ప్రాంతాలలో పర్యటించి, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు.
ఈ నెల 29న కేటీఆర్ మళ్లీ వరంగల్‌కు రానుండగా, కీలక నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనతో GWMC ఎన్నికలలో BRS పార్టీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ రాజకీయాల్లో ఈ పరిణామాలు కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


