హన్మకొండ:కాకతీయ యూనివర్సిటీ (KU) మెస్ హాస్టల్లో మరోసారి ఆహార భద్రత లోపాలు బయటపడ్డాయి. ఆదివారం ఉదయం విద్యార్థులకు వడ్డించిన ఉప్మాలో పురుగులు రావడంతో హాస్టల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. నాణ్యత లేని ఆహారాన్ని చూసి విద్యార్థులు తీవ్ర అయోమయానికి, ఆందోళనకు గురయ్యారు.
పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు
గతంలో కూడా చాలాసార్లు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు ఉదయం టిఫిన్ (ఉప్మా)లో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనంలో పురుగులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, శుభ్రత పాటించాలని విద్యార్థులు పలుమార్లు అధికారులకు, నిర్వాహకులకు ఫిర్యాదులు చేశారు.
అయినప్పటికీ హాస్టల్ నిర్వాహకులు ఏమాత్రం బాధ్యత లేకుండా పాత పద్ధతిలోనే వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు.
”ఇలా పురుగులు వచ్చిన ఉప్మాను మేం ఎలా తినాలి? మా ఆరోగ్యాలతో ఆటలాడుకుంటారా?” అని విద్యార్థులు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు.
ఈ ఉదంతంపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, మెస్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Read Warangal News and Latest Politics News and Real Estate

