హన్మకొండ: హన్మకొండ పెళ్లయిన 4 రోజులకే నవ వరుడు తండ్రి మృతి ఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది. హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన శరత్, అతని తండ్రి సాంబయ్య విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు.
పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నింపిన ఘోర ప్రమాదం హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివాహం జరిగిన కేవలం నాలుగు రోజులకే విద్యుత్ షాక్‌తో నవ వరుడు, అతని తండ్రి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
పెళ్లి ఇంట్లో ఆనందం నిండాల్సిన వేళ విషాదం అలుముకుంది. హన్మకొండ భీమారంలో పెళ్లయిన కేవలం నాలుగు రోజులకే నవ వరుడు, అతని తండ్రి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన సాంబయ్య, రమాదేవి దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరి చిన్న కుమారుడైన శరత్‌కు నాలుగు రోజుల క్రితమే నగరానికి చెందిన ఒక మహిళతో ఘనంగా వివాహమైంది. పెళ్లి వేడుక ముగిసి ఇంట్లో పండగ వాతావరణం ఉండగానే ఈ ఘోరం జరిగింది.
ఇంటిపై సామాన్లు సర్దుతున్న క్రమంలో తండ్రీకొడుకులు ఇద్దరికీ అనుకోకుండా కరెంట్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు రోజుల ముచ్చటైన పెళ్లి ఇంట్లో ఒకేసారి తండ్రీకొడుకులు మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Warangal News and Latest Politics News and Real Estate

