హనుమకొండ: వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌తో పాటు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ఇద్దరికీ పుష్పగుచ్ఛాలు, మొక్కలను అందించి పరిచయం చేసుకున్నారు.
వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధి మరియు సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణపై కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కీలక సూచనలు చేశారు. నూతన కార్యవర్గ సభ్యులతో సమావేశమైన వారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.సమాజానికి ఉపయోగపడేలా సేవలు: కలెక్టర్
కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. కేవలం అంతర్గత కార్యకలాపాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఎంతగానో ఉపయోగపడే వినూత్న సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆకాంక్షించారు.
అన్ని విధాలా సహకరిస్తాం: ఎమ్మెల్యే నాయిని
మరోవైపు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసిన కమిటీ సభ్యులు తమ భవిష్యత్తు కార్యాచరణను ఆయనకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ.. క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పడే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధికి తమ వంతుగా అన్ని విధాలా పూర్తి సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

