హనుమకొండ పరిధిలోని గుండ్ల సింగారం ప్రాంతంలో నేడు ఉద్రిక్తత సంతరించుకున్న భూపోరాట ప్రాంతాన్ని సీపీఐ అగ్రనేతలు సందర్శించనున్నారు. సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితో పాటు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గుండ్ల సింగారానికి చేరుకోనున్నారు.
స్థానికంగా సాగుతున్న భూపోరాట పరిస్థితిని, బాధితుల సమస్యలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ అంశంపై అక్కడి వారితో మాట్లాడి వివరాలు సేకరించిన అనంతరం, వారు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో స్థానిక సీపీఐ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read Warangal News and Latest Politics News and Real Estate

