HomeWarangal Newsభద్రకాళి ఆలయంలో బీజేపీ "శుద్ధి" యత్నం: ఉద్రిక్తత.. నేతల అరెస్ట్, మట్టేవాడ పీఎస్‌కు తరలింపు

భద్రకాళి ఆలయంలో బీజేపీ “శుద్ధి” యత్నం: ఉద్రిక్తత.. నేతల అరెస్ట్, మట్టేవాడ పీఎస్‌కు తరలింపు

Published on

spot_img

వరంగల్: వరంగల్లో భద్రకాళి ఆలయం శుద్ధి యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. భద్రకాళి ఆలయం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. వరంగల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రకాళి అమ్మవారి ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల సవాల్, ప్రతిసవాళ్ల పర్వంతో ఆలయం మైలపడిందని ఆరోపిస్తూ… బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఆలయ శుద్ధి కార్యక్రమానికి యత్నించారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలపై బీజేపీ విమర్శలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు భద్రకాళి ఆలయంలో తప్పుడు ప్రమాణాలు చేసి ఆలయ పవిత్రతకు మకిలి అంటించారని బీజేపీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంటా రవికుమార్, కోలాన్ సంతోష్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. రెండు పార్టీల రాజకీయ సవాళ్ల వల్ల అపవిత్రమైన ఆలయాన్ని పునరుద్ధరించేందుకు తాము “శుద్ధి” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. భారీగా అరెస్టులు

ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆలయ శుద్ధి కార్యక్రమానికి తరలివచ్చిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు ఆలయ పరిసరాల్లోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం, నెట్టివేతలు జరిగాయి. పరిస్థితి చేజారకుండా పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని వాహనాల్లో మట్టేవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మొత్తంగా భద్రకాళి ఆలయం శుద్ధి యత్నం ఘటన వరంగల్‌లో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles