HomeLatest Newsకరాటేలో సత్తా చాటిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు: బంగారు పతకం కైవసం

కరాటేలో సత్తా చాటిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు: బంగారు పతకం కైవసం

Published on

spot_img

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కరాటే బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయిలో మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026” లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు.

​ఈ క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన కరాటే జట్టు విభాగంలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన కానిస్టేబుళ్లు నరసింహులు, రాకేశ్, సాయికుమార్ లతో కూడిన జట్టు అద్భుతమైన ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తమ అసాధారణమైన ప్రతిభతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిచెప్పారు.

​కమిషనర్ శ్వేత అభినందనలు:

​రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి విజేతలుగా నిలిచిన కానిస్టేబుళ్లు నరసింహులు, రాకేశ్, సాయికుమార్‌లను వరంగల్ పోలీస్ కమిషనరర్ శ్వేత ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విధి నిర్వహణలోనే కాకుండా క్రీడల్లోనూ ఇలాంటి ప్రతిభ కనబరచడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి, కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి క్రీడల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కరాటే బంగారు పతకం సాధించడం కమిషనరేట్‌కు గర్వకారణంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.