HomeWarangal Newsహనుమకొండ: ట్రాఫిక్ క్లియరెన్స్‌పై కాజీపేట పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

హనుమకొండ: ట్రాఫిక్ క్లియరెన్స్‌పై కాజీపేట పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Published on

spot_img

హనుమకొండ: కాజీపేట ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ హనుమకొండలోని వడ్డేపల్లి చర్చి–అంబేద్కర్ సర్కిల్ ప్రధాన రహదారిపై నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి వరంగల్ నగరానికి అనుసంధానమయ్యే వడ్డేపల్లి చర్చి – అంబేద్కర్ సర్కిల్ ప్రధాన రహదారిపై కాజీపేట ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ అంతరాయాలను తొలగించేందుకు ఈ ముమ్మర తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజులుగా ఏసీపీ టి. సత్యనారాయణ, సీఐ పిట్టల వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు, డీఆర్‌ఎఫ్ (DRF) సిబ్బందితో కలిసి రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.

అదేవిధంగా రహదారిని ఆక్రమిస్తూ ఏర్పాటు చేసిన షాపుల నేమ్‌బోర్డులు, సైన్‌బోర్డులను పూర్తిగా తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. ఈ సందర్భంగా కాజీపేట ట్రాఫిక్ సీఐ పిట్టల వెంకన్న మాట్లాడుతూ… భవిష్యత్తులో ఈ రహదారిని 100 అడుగుల వెడల్పుతో విస్తరించనున్నట్లు తెలిపారు. కాబట్టి వ్యాపారులు ఎవరూ కూడా రోడ్లపై ఆక్రమణలు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

వ్యాపారులు రహదారులను ఆక్రమించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. కాజీపేట ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ పిట్టల వెంకన్న హెచ్చరించారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles