న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో మొత్తం 1,450 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 12, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అర్హతలు ఇవే:
ఈ నియామకాలకు 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి అవసరమైన విద్యార్హతలు మారే అవకాశం ఉండటంతో అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించడం మంచిది.
రాత పరీక్ష లేదు:
ఈ నియామకాల ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. అభ్యర్థులు విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఎంపిక చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ప్రక్రియ పూర్తిచేసిన వారికి అప్రెంటిస్ అవకాశం కల్పిస్తారు.

దరఖాస్తు ఫీజు లేదు:
ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి ఎలాంటి దరఖాస్తు రుసుము వసూలు చేయడం లేదు. దీంతో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు ఇది మంచి అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు పూర్తి అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం వంటి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుని గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని ఐఓసీఎల్ సూచించింది.
దరఖాస్తు వెబ్‌సైట్:https://iocl.com/apprenticeships?utm
Read Warangal News and Latest Politics News and Real Estate


