హైదరాబాద్:నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న ‘సక్సెస్’ స్కూల్లో మతపరమైన బోధనలు జరుగుతున్నాయంటూ ఒక విద్యార్థి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు, సదరు ఉపాధ్యాయురాలి తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర వివాదానికి దారితీసింది.
అసలేం జరిగిందంటే?
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సదరు పాఠశాలలో చదువుతున్న తమ రెండేళ్ల అబ్బాయి హోం వర్క్ బుక్‌లో టీచర్ వివాదాస్పద రీతిలో హోం వర్క్ రాశారు. ఆ బుక్‌లో ‘కల్మా చదవాలి’ (read surah fateha / read 2 kalma) అని ఉపాధ్యాయురాలు రాయడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
చిన్న వయసు పిల్లలపై ఇలా మతాలను రుద్దడం ఏంటని ప్రశ్నిస్తూ వారు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోట ఇలాంటి మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దడం సరైన పద్ధతి కాదని వారు మండిపడ్డారు.
యాజమాన్యం చర్యలు – ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన
ఈ ఘటనపై బాధితుల నుంచి నిరసన వ్యక్తమవడంతో పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించింది. వివాదానికి కారణమైన సదరు టీచర్‌ను విధుల్లోంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. పాఠశాలల్లో ఇలాంటి మతపరమైన ప్రచారాలు, బోధనలు చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది.
Read Warangal News and Latest Politics News and Real Estate


