HomeWarangal Newsకాన్వాయ్‌లో ఎస్కార్ట్ వాహనం తొలగింపు..వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత కీలక నిర్ణయం..!

కాన్వాయ్‌లో ఎస్కార్ట్ వాహనం తొలగింపు..వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత కీలక నిర్ణయం..!

Published on

spot_img

వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తన భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు తగ్గించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నక్సల్స్ ప్రభావం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కమిషనర్‌కు కల్పిస్తున్న వ్యక్తిగత భద్రతను పునర్వ్యవస్థీకరించారు.

ఇప్పటి వరకు అమల్లో ఉన్న 2+2 భద్రతా విధానం ప్రకారం నలుగురు గన్‌మెన్లు విధులు నిర్వహించగా, ఇకపై 1+1 భద్రతా విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మార్పుతో కమిషనర్‌కు ఇద్దరు గన్‌మెన్లు మాత్రమే భద్రత కల్పించనున్నారు.

అదే సమయంలో కమిషనర్ కాన్వాయ్‌లో ముందుగా ఎస్కార్ట్‌గా ప్రయాణించే వాహనాన్ని కూడా తొలగించాలని నిర్ణయించారు. ఆ వాహనంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు స్పెషల్ ప్రొటెక్షన్ సిబ్బందిని ఇతర అవసరమైన పోలీసు విధులకు వినియోగించనున్నట్లు సమాచారం. దీంతో పోలీసు బలగాల వినియోగంలో మరింత సమర్థత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా పోలీసు వ్యవస్థ పనిచేయాలన్నదే తన లక్ష్యమని కమిషనర్ శ్వేత స్పష్టం చేశారు. తాను అధికారికంగా ప్రయాణించే సమయంలో సామాన్య ప్రజల వాహనాలను అనవసరంగా నిలిపివేయవద్దని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా ట్రాఫిక్‌ను నిలిపివేసే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఇబ్బందులు తగ్గించడంతో పాటు పోలీసు సిబ్బందిని అవసరమైన ప్రాంతాల్లో మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం వరంగల్ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles