HomeLatest NewsSATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్..పూర్తి వివరాలు ఇవే!

SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్..పూర్తి వివరాలు ఇవే!

Published on

spot_img

తెలంగాణలో క్రీడల్లో రాణించాలని కలలు కంటున్న బాలబాలికలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని స్పోర్ట్స్ హాస్టల్స్, వివిధ క్రీడా అకాడమీల్లో ప్రవేశాల కోసం ఎంపికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై 20 నుంచి 28 వరకు రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో ఎంపికల ట్రయల్స్ నిర్వహించనున్నారు.

ఎవరు అర్హులు?

ఈ ఎంపికలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు మాత్రమే వర్తిస్తాయి. జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్, సైక్లింగ్, కబడ్డీ, ఫుట్‌బాల్ వంటి విభాగాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చు.

SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్
SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్

ఎక్కడెక్కడ ట్రయల్స్?

SATG విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..

*సైక్లింగ్ & రెజ్లింగ్ అకాడమీ (ఓయూ వెలోడ్రోమ్) – జూలై 20
*అథ్లెటిక్స్ అకాడమీ, ఖమ్మం – జూలై 21
*వాలీబాల్ అకాడమీ, సిద్ధిపేట – జూలై 22, 23
*వాలీబాల్ & కబడ్డీ అకాడమీ, మహబూబ్‌నగర్ – జూలై 25, 26
*వాలీబాల్ అకాడమీ, సరోర్నగర్ – జూలై 20, 21
*ప్రాంతీయ క్రీడా వసతి గృహం (హనుమకొండ) – జూలై 27, 28
*హాకీ, అథ్లెటిక్స్ అకాడమీ గచ్చిబౌలి – జూలై 20, 21
*హాకీ అకాడమీ వనపర్తి – జూలై 20, 21
*హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ అకాడమీ (లాల్ బహదూర్ స్టేడియం) – జూలై 20, 21

SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్
SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్


వయోపరిమితి ఎంత?

విభాగాన్ని బట్టి వయోపరిమితిని నిర్ణయించారు.

*జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ – 10 నుంచి 12 సంవత్సరాలు
*అథ్లెటిక్స్, సైక్లింగ్, హ్యాండ్‌బాల్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్, కబడ్డీ, ఫుట్‌బాల్ – 14 నుంచి 16 సంవత్సరాలు
*సరోర్నగర్ వాలీబాల్ అకాడమీకి ప్రత్యేకంగా 16 నుంచి 18 సంవత్సరాలు కూడా అవకాశం కల్పించారు.

SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్
SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్

ప్రాధాన్యం ఎవరికి?

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు లేదా ఛాంపియన్‌షిప్‌ల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎంపికల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది. అదనంగా శారీరక సామర్థ్యం, నైపుణ్యం, వైద్య పరీక్షలు, ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్
SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్

వాలీబాల్ క్రీడాకారులకు ప్రత్యేక నిబంధనలు:

వాలీబాల్ అకాడమీల్లో ప్రవేశాల కోసం ఎత్తుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

*అండర్-14 బాలురు – 170 సెం.మీ. పైగా
*అండర్-14 బాలికలు – 160 సెం.మీ. పైగా
*అండర్-16 బాలురు – 180 సెం.మీ. పైగా
*అండర్-16 బాలికలు – 170 సెం.మీ. పైగా
*అండర్-18 బాలురు – 185 సెం.మీ. పైగా
*అండర్-18 బాలికలు – 175 సెం.మీ. పైగా

SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్
SATG అలర్ట్: స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అడ్మిషన్లు.. జూలై 20 నుంచే ట్రయల్స్


తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు

ట్రయల్స్‌కు హాజరయ్యే విద్యార్థులు ఈ పత్రాలను వెంట తీసుకురావాలి.

*ప్రస్తుత చదువు ధృవీకరణ పత్రం
*జనన ధృవీకరణ పత్రం లేదా 10వ తరగతి మెమో
*10 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
*ఆధార్ కార్డు లేదా నివాస ధృవీకరణ పత్రం

గుర్తుంచుకోవాల్సిన విషయం:

పుట్టిన తేదీ, చదువు వివరాల్లో తేడాలు ఉన్నట్లయితే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని స్పోర్ట్స్ అథారిటీ స్పష్టం చేసింది. ఎంపికైన వారికి కమిటీ సిఫారసు మేరకు తాత్కాలిక ప్రవేశాలు కల్పించి, అనంతరం తుది జాబితాను విడుదల చేయనుంది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.