మామునూర్ ఎయిర్‌పోర్టు పనులకు గ్రీన్ సిగ్నల్.. టెండర్‌లో కీలక నిబంధనలు :
వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న మామునూర్ ఎయిర్‌పోర్టు పనులకు భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) టెండర్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. టెండర్‌ను దక్కించుకునే సంస్థ ప్రాజెక్టును ఒప్పందం కుదిరిన తేదీ నుంచి 15 నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని AAI స్పష్టమైన నిబంధన విధించింది. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్‌కు వైమానిక అనుసంధానం కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది.

రూ.203.49 కోట్ల అంచనా వ్యయం:
AAI విడుదల చేసిన టెండర్ వివరాల ప్రకారం, మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రూ.203.49 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించింది. టెండర్‌లో పాల్గొనే సంస్థలు ధరావత్తు (EMD)గా రూ.6.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ దరఖాస్తులు సమర్పించేందుకు ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు గడువు కల్పించారు.
ఈనెల 29 నుంచి టెండర్ పత్రాల విక్రయం:
టెండర్ పత్రాలను ఈ నెల 29 నుంచి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఒక్కో టెండర్ పత్రం ధర రూ.11,800గా నిర్ణయించారు. నిర్ణీత గడువులోపు పత్రాలను కొనుగోలు చేసి, అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

జూలై 23న ప్రీ-బిడ్ సమావేశం:
టెండర్ ప్రక్రియలో భాగంగా ఆసక్తి ఉన్న సంస్థల సందేహాలను నివృత్తి చేసేందుకు జూలై 23న మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు AAI వెల్లడించింది. ఈ సమావేశంలో టెండర్ నిబంధనలు, సాంకేతిక అంశాలు, పనుల అమలు విధానం వంటి అంశాలపై అధికారులు వివరణ ఇవ్వనున్నారు.
మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మెరుగైన విమాన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పారిశ్రామిక, వ్యాపార, పర్యాటక రంగాలకు కూడా గణనీయమైన ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


