HomeWarangal News"రైజ్ హర్-2026" సదస్సులో కడియం కావ్య కీలక ప్రసంగం.. మహిళలకు పలు సూచనలు

“రైజ్ హర్-2026” సదస్సులో కడియం కావ్య కీలక ప్రసంగం.. మహిళలకు పలు సూచనలు

Published on

spot_img

రైజ్ హర్-2026′ సదస్సులో కడియం కావ్య కీలక ప్రసంగం.. మహిళలకు పలు సూచనలు:

మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లో తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSICC) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైజ్ హర్–2026’ మహిళా సాధికారత సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య2
వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య2

మహిళలకు సమాన అవకాశాలు అవసరం:

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, నాయకత్వ వికాసానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు 50 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళలు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య1
వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య1

సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ప్రోత్సాహం:

రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేస్తూ మహిళల్లో పొదుపు, స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కుటుంబంతో పాటు సమాజం, రాష్ట్ర అభివృద్ధికి కూడా కీలకంగా దోహదపడతారని చెప్పారు.

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య9
వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య9

విద్య, నాయకత్వంలో ముందుండాలి:

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన ‘పే బ్యాక్ టు సొసైటీ’ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తూ జాతీయ గౌరవాన్ని పెంపొందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, నాయకత్వ రంగాల్లో మరింత ముందుకు వచ్చి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. జీవితాంతం నేర్చుకుంటూ నిత్య విద్యార్థులుగా ఎదగాలని యువతకు సందేశం ఇచ్చారు. సదస్సులో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, వి-హబ్ డైరెక్టర్ జావేద్ అక్తర్ షేక్, టీఎస్‌ఐసీసీ అధ్యక్షుడు నల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles