HomeWarangal Newsఎస్సీ, ఎస్టీ బాధితులకు తక్షణ న్యాయం జరగాలి.. నిధుల పంపిణీపై వరంగల్ కలెక్టర్ డా. సత్య...

ఎస్సీ, ఎస్టీ బాధితులకు తక్షణ న్యాయం జరగాలి.. నిధుల పంపిణీపై వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద కీలక ఆదేశాలు

Published on

spot_img

వరంగల్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై జరిగే అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సకాలంలో ఆర్థిక సహాయం అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆదేశించారు.

 శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీసీఆర్/పీఓఏ చట్టం అమలు, బాధితులకు అందించిన పరిహారం, పెండింగ్ కేసులు, నిధుల అవసరం తదితర అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 197 మంది ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ బాధితులు ఉన్నట్లు అధికారులు నివేదించారని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ బాధితులకు పరిహారం అందించేందుకు రూ.1,57,48,000 బడ్జెట్ అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం ఇప్పటికే రూ.74,48,000 మంజూరు చేసిందని వివరించారు. ఈ నిధుల నుంచి ఇప్పటివరకు 75 మంది లబ్ధిదారులకు రూ.74,35,500 పరిహారం చెల్లించినట్లు కలెక్టర్ వెల్లడించారు.

ఇంకా పరిహారం అందని అర్హులైన బాధితులకు సంబంధించిన నిధుల ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని, పోలీసు శాఖలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు:

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) విజయలక్ష్మి, వరంగల్ ఆర్డిఓ సుమా, నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి, డిబిసిడివో మరియు డిఎస్డివో ఇంచార్జ్ పుష్పలత, వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట, మామ్నూర్ ప్రాంతాల ఎసిపిలు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles