HomeEntertainment'రామాయణ'కు భారీ షాక్.. ట్రైలర్ ముందే లీకైన వీడియోలు వైరల్!

‘రామాయణ’కు భారీ షాక్.. ట్రైలర్ ముందే లీకైన వీడియోలు వైరల్!

Published on

spot_img

‘రామాయణ’కు భారీ షాక్.. ట్రైలర్ ముందే లీకైన వీడియోలు వైరల్:

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘రామాయణ’ చిత్రానికి అనుకోని షాక్ తగిలింది. అధికారిక ట్రైలర్ విడుదలకు ముందే సినిమాకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో అవి వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్స్‌లో ప్రధాన పాత్రల లుక్స్, కొన్ని విజువల్ షాట్లు కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. అయితే చిత్రబృందం అనుమతి లేకుండా ఈ వీడియోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

'రామాయణ'కు భారీ షాక్.. ట్రైలర్ ముందే లీకైన వీడియోలు వైరల్!1
‘రామాయణ’కు భారీ షాక్.. ట్రైలర్ ముందే లీకైన వీడియోలు వైరల్!1

భారీ అంచనాల మధ్య లీక్:

భారీ బడ్జెట్‌తో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లకు మంచి స్పందన లభించగా, ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో లీక్ అయిన వీడియోలు సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. రీసెంట్‌గా రామాయణ మూవీ మేకర్స్ ప్రథమ్ సంకల్ప్ పేరుతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా 3 నిమిషాల నిడివి గల ట్రైలర్‌ను చూపించారు. మీడియా వాళ్లకి మాత్రమే ఇది చూపించారు. రికార్డ్ చేయద్దు అని కూడా చెప్పారు. కానీ సీక్రేట్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అయితే.. దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

'రామాయణ'కు భారీ షాక్.. ట్రైలర్ ముందే లీకైన వీడియోలు వైరల్!3
‘రామాయణ’కు భారీ షాక్.. ట్రైలర్ ముందే లీకైన వీడియోలు వైరల్!3

సోషల్ మీడియాలో భిన్న స్పందనలు:

లీక్ అయిన క్లిప్స్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తుండగా, మరికొందరు అధికారిక ట్రైలర్ వచ్చే వరకు ఇలాంటి వీడియోలను ప్రచారం చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు మాత్రం పూర్తి స్థాయి ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'రామాయణ'కు భారీ షాక్.. ట్రైలర్ ముందే లీకైన వీడియోలు వైరల్!6
‘రామాయణ’కు భారీ షాక్.. ట్రైలర్ ముందే లీకైన వీడియోలు వైరల్!6

చిత్రబృందం అప్రమత్తం

వీడియోలు ఎలా లీక్ అయ్యాయనే అంశంపై చిత్రబృందం అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లీక్‌లను తొలగించేందుకు సంబంధిత సోషల్ మీడియా వేదికలకు ఫిర్యాదులు చేసే అవకాశమున్నట్లు సమాచారం.

అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. భారీ అంచనాలతో రూపొందుతున్న ‘రామాయణ’ చిత్ర ట్రైలర్ విడుదల తర్వాత ఈ లీక్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాల్సి ఉంది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

హైదరాబాద్‌లో బిగ్ స్క్రీన్‌ మ్యాజిక్‌.. డిసెంబర్‌లో కొత్త ఐమ్యాక్స్‌!

హైదరాబాద్‌ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో కొత్త ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ స్క్రీన్‌తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన బిగ్‌ స్క్రీన్‌ అనుభూతి లభించనుంది.

ప్రధాని మోదీ బర్త్‌డే..1,000 మంది మహిళల కోసం మెగా పవర్‌స్టార్‌ భారీ నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా 1,000 మంది మహిళలకు మద్దతు అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు.

స్నేహకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న చిరంజీవి.. లైఫ్ లో మర్చిపోలేనిది..!?

హీరోయిన్ స్నేహకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ సర్‌ప్రైజ్ ఉండనుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.