HomeWarangal Newsవరంగల్‌లో ఆయుష్ సేవల అభివృద్ధిపై లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్న..!

వరంగల్‌లో ఆయుష్ సేవల అభివృద్ధిపై లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్న..!

Published on

spot_img

వరంగల్‌లో ఆయుష్ సేవల అభివృద్ధిపై లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్న..:

వరంగల్: జిల్లాలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో ఆయుష్ వైద్య సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర నిధులు కేటాయించింది? ఎలాంటి మౌలిక వసతులు కల్పించింది? ఆయుష్ సేవలను సాధారణ వైద్య వ్యవస్థతో ఎలా అనుసంధానం చేస్తోంది? అనే అంశాలపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు.

కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం:

దీనికి స్పందించిన కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ ఆయుష్ మిషన్ (NAM) కింద వరంగల్ జిల్లాలోని తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో భవనాల మరమ్మతులు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, శాశ్వత యోగా షెడ్ల నిర్మాణానికి కేంద్రం మద్దతు అందించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు బ్లాక్ నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.

మూడు సంవత్సరాల్లో విడుదలైన నిధులు:

ప్రభుత్వ ఆయుర్వేద బోధనా ఆసుపత్రి, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అభివృద్ధితో పాటు తొమ్మిది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, రెండు ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలకు అవసరమైన మందుల సరఫరా కోసం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

2023–24: రూ.56.16 లక్షలు
2024–25: రూ.24.32 లక్షలు
2025–26: రూ.3.23 కోట్లు

గ్రామీణ ప్రాంతాలకు ఆయుష్ సేవలు విస్తరించాలి: కడియం కావ్య

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఆయుష్ వైద్య వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. జిల్లాలో ఆయుర్వేదం, యోగా, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాల విస్తరణకు మరింత నిధులు, ఆధునిక మౌలిక వసతులు అవసరమని అభిప్రాయపడ్డారు.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయుష్ సేవలను మరింత విస్తరించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles