HomeWarangal Newsవరంగల్ నీటి వనరుల అభివృద్ధికి కేంద్రం భారీ ప్రణాళిక.. ఎంపీ కడియం కావ్య కీలక విజ్ఞప్తి..!

వరంగల్ నీటి వనరుల అభివృద్ధికి కేంద్రం భారీ ప్రణాళిక.. ఎంపీ కడియం కావ్య కీలక విజ్ఞప్తి..!

Published on

spot_img

వరంగల్ నీటి వనరుల అభివృద్ధికి కేంద్రం భారీ ప్రణాళిక.. ఎంపీ కడియం కావ్య కీలక విజ్ఞప్తి..:

వరంగల్ జిల్లాలో చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల పునరుద్ధరణతో పాటు భూగర్భ జలాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. నీటి వనరుల సంరక్షణ అనేది కేవలం అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాకుండా, వ్యవసాయం, తాగునీటి భద్రత, భూగర్భ జలాల పరిరక్షణకు కీలకమని ఆమె సభ దృష్టికి తీసుకెళ్లారు. గత మూడు సంవత్సరాల్లో కేంద్రం నుంచి విడుదలైన నిధులు, చేపట్టిన పనులు, వాటి ప్రభావంపై పూర్తి వివరాలను కోరారు.

రాయపర్తిలో రూ.10.16 కోట్ల ప్రాజెక్టు:

ఎంపీ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనలోని వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ (WDC-PMKSY 2.0) కింద వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో రూ.10.16 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు అమలవుతోందని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు రూ.3.17 కోట్ల కేంద్ర నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2.64 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడగా, 235.20 హెక్టార్లలో పంటల సాగు విస్తరించినట్లు, మరో 54.40 హెక్టార్ల భూమిని బహుళ పంటల సాగుకు అనువుగా మార్చినట్లు పేర్కొన్నారు.

ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద వేలాది పనులు:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) ద్వారా గత మూడేళ్లలో వరంగల్ జిల్లాలో నీటి సంరక్షణ, నీటి నిల్వలకు సంబంధించిన 5,369 పనులను రూ.85.65 కోట్ల వ్యయంతో పూర్తి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో 715 సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ పనుల కోసం రూ.47.90 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.

మరిన్ని నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి:

కేంద్రం వెల్లడించిన గణాంకాలు జిల్లాలో నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యతను చూపిస్తున్నాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. అయితే కాగితాలపై నమోదైన పురోగతి కంటే ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఫలితాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రాయపర్తి ప్రాజెక్టుకు మిగిలిన నిధులను త్వరగా విడుదల చేయాలని, అమృత్ 2.0 కింద నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ప్రాంతాల్లో చేపట్టిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల పునరుద్ధరణను విస్తరించి, భూగర్భ జలాల పెంపు కోసం సాచురేషన్ మోడ్‌లో కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles