HomeLatest News7,437 పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 19 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

7,437 పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 19 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Published on

spot_img

7,437 పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 19 నుంచి అప్లికేషన్లు ప్రారంభం:

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర పోలీస్ శాఖలో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల షెడ్యూల్‌ను తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను అధికారులు స్వీకరించరని స్పష్టం చేశారు.

పోస్టుల ఆధారంగా దరఖాస్తు ఫీజులు:

అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న పోస్టును బట్టి పరీక్ష ఫీజులు వేర్వేరుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 లేదా రూ.750, ఇతర వర్గాల అభ్యర్థులకు రూ.1,200 లేదా రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత ఫీజు వర్తిస్తుందనే పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు కూడా బోర్డు ఊరటనిచ్చింది. అదనపు పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50, ఇతర అభ్యర్థులకు రూ.100 చొప్పున ఫీజులో మినహాయింపు కల్పించనున్నట్లు వెల్లడించింది. దీంతో అర్హత ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి:

దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వయోపరిమితి, విద్యార్హతలు, ఎంపిక విధానం, పరీక్ష తేదీలు, ఫిజికల్ టెస్టులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు. అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులకు కీలక అవకాశంగా మారింది. పూర్తి వివారాల కోసం https://www.tgprb.in/ ఈ లింక్ ని క్లిక్ చేయండి..!!

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.