నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి పట్ల వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం నల్లబెల్లిలోని వారి స్వగృహానికి చేరుకున్న ఎంపీ, సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం, మాజీ ఎమ్మెల్యే సతీమణి పెద్ది స్వప్నతో పాటు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా స్వప్న గారికి, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని నూరిపోస్తూ, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలితో పాటు పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


