HomePoliticsచెన్నైలో హైటెన్షన్.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

చెన్నైలో హైటెన్షన్.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

Published on

spot_img

తమిళనాడు రాజధాని చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత, హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమిళనాడు సీఎం విజయ్, ప్రముఖ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

దీంతో ఆయనను అదుపులోకి తీసుకోవడానికి టీవీకే కార్యకర్తలు ఉదయనిధి నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో డీఎంకే, టీవీకే కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉదయనిధిని అరెస్ట్ చేశారు.

​ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా డీఎంకే శ్రేణులు పోలీసు వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపాయి. ప్రస్తుతం అతడిని తంజావూరుకు తీసుకువెళ్లినట్లు సమాచారం.

​మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్

​మరోవైపు, ఈ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఉదయనిధి తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

నా అరెస్ట్.. ఒక జోక్: మాజీ డిప్యూటీ సీఎం

చెన్నైలోని నీలంగరైలోని తన నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా ఉదయనిధి మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ ఒక జోక్ అని, తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని అన్నారు. తాను తప్పు చేశానా లేదా అనేది న్యాయస్థానమే తేలుస్తుందని, తాను ఎవరి పేరూ ప్రస్తావించలేదని, న్యాయపరంగానే ఈ అంశాన్ని ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.