ఫుట్‌బాల్ : థాయ్‌లాండ్‌లోని నరాధివాట్ ప్రావిన్స్‌లో నిర్వహించిన గోలక్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. శాంటిప్ హప్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పిడుగు పడింది. ఆ పిడుగు నేరుగా మైదానంలో ఆడుతున్న వింగర్ సొఫ్వాన్ అవాయే పై పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
12 మందికి గాయాలు:
ఈ ఘటనలో మరో 12 మంది గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనతో ఆటగాళ్లు, నిర్వాహకులు, ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరణించిన వింగర్ సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్-టియర్ క్లబ్ అయిన ‘యాలా ఎఫ్‌సీ’కి సైన్ చేశాడు. అతని హఠాన్మరణం పట్ల యాలా ఎఫ్‌సీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://www.facebook.com/watch/?v=2278265026273711


