HomeLatest Newsఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

ఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై లోక్‌సభలో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు అందుతున్న ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, రీఫిల్ సబ్సిడీ, నిరంతర గ్యాస్ వినియోగ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గురువారం లోక్‌సభలో ప్రశ్నించారు.

​గత మూడేళ్లలో వరంగల్ నియోజకవర్గ పరిధిలో మంజూరు చేసిన ఉజ్వల కనెక్షన్ల వివరాలతో పాటు, పేద కుటుంబాలు క్రమం తప్పకుండా సిలిండర్లు రీఫిల్ చేసుకునేలా ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని ఆమె వివరణ కోరారు.

​ఎంపీ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2026 జూలై 1 నాటికి మొత్తం 1.22 లక్షల ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (PMUY) కనెక్షన్లు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. గత మూడేళ్లలో 2023-24లో 2,928, 2024-25లో 84, 2025-26లో 2,835 కనెక్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాల వారీగా జనగామలో 1,825, జయశంకర్ భూపాలపల్లిలో 1,903, హనుమకొండలో 1,359, వరంగల్‌లో 760 కనెక్షన్లు విడుదల చేసినట్లు వివరించారు.

​ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ… పేద మహిళల ఆరోగ్య భద్రతకు ఉజ్వల పథకం కీలకమైనప్పటికీ, కేవలం కనెక్షన్లు ఇచ్చినంత మాత్రాన సరిపోదని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిలిండర్లను రీఫిల్ చేసుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉజ్వల కనెక్షన్లు అందించాలని, రీఫిల్ సబ్సిడీని కొనసాగిస్తూనే అవసరమైతే మరింత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.