తెలంగాణ: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ‘వరుణ యాగం’ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సీఎం సూచనల మేరకు ఈ నెల 10వ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, పండితులు మరియు సిద్ధాంతులు చర్చించి ఈ ముహూర్తాన్ని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక యాగ కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద చేపట్టనున్నట్లు మంత్రి ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలోని నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలనే సదుద్దేశంతో ఈ పూజలు మరియు యాగం నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


